AP Election commission: మిగిలిన పురపాలికలకు త్వరలో ఎన్నికలు - telugu news Elections soon for the remaining municipalities in ap
close
Updated : 10/08/2021 08:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Election commission: మిగిలిన పురపాలికలకు త్వరలో ఎన్నికలు

సవరించిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఈసీ ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 11 పురపాలక, నగర పంచాయతీల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వివిధ కారణాలతో సభ్యులు మృతి చెందిన 8 పురపాలక, నగర పంచాయతీల్లోని పలు వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సవరించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని పురపాలకశాఖను ఎన్నికల సంఘం కమిషనరు సోమవారం ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలోని 75 పురపాలక, నగర పంచాయతీలు, 12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. కోర్టు వివాదాలు, ఇతర కారణాలతో నిర్వహించలేని చోట్ల ఇప్పుడు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కమిషనరు నీలం సాహ్ని ఇటీవల పురపాలకశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఎన్నికలు నిర్వహించే పురపాలిక, నగర పంచాయతీలు

ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, పెనుకొండ.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని