Varun Tej: ‘గని’ గీతాలాపన - telugu news Ghani First Song Release Announcement
close
Updated : 23/10/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varun Tej: ‘గని’ గీతాలాపన

రుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా.. డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. దీనిలో భాగంగా ఈనెల 26న ‘గని ఆంథమ్‌’ పేరుతో ఓ పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో వరుణ్‌ బాక్సర్‌గా కసరత్తులు చేస్తూ కనిపించారు. ‘‘బాక్సింగ్‌ నేపథ్యంగా అల్లుకున్న కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌తో పాటు నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని ఈ చిత్ర వర్గాలు తెలియజేశాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని