AP News: పిడుగుపడి ఇల్లు దగ్ధం.. కాలిపోయిన రూ.25 లక్షలు - telugu news House burnt down by Thunder lightning Rs 25 lakh burnt
close
Updated : 19/09/2021 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: పిడుగుపడి ఇల్లు దగ్ధం.. కాలిపోయిన రూ.25 లక్షలు

చింతలపూడి గ్రామీణ, న్యూస్‌టుడే: పిడుగుపాటుతో తాటాకిల్లు దగ్ధమై అందులో ఉంచిన రూ.25 లక్షల నగదు కాలిపోయిన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాళ్ల కృష్ణవేణి, ఆమె కుమారుడు ఇంట్లో ఉండగా పక్కనే ఉన్న గడ్డివామి నుంచి మంటలు చెలరేగాయి. ఇంటికి కూడా వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. వీరు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఇటీవలే భూమిని అమ్మగా వచ్చిన రూ.25 లక్షల నగదుతో పాటు బంగారం పూర్తిగా కాలిపోయాయని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫోన్‌ చేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా స్పందించారని, అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని