Sarkaru Vaari Paata: పాటలు పూర్తి - telugu news Music Composition Of Sarkaru Vaari Paata Completed
close
Updated : 23/10/2021 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sarkaru Vaari Paata: పాటలు పూర్తి

హేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ప్రస్తుతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో చిత్రీకరణ జరుపుకొంటోంది. కాగా.. ఈ సినిమాకి సంబంధించిన పాటల కంపోజిషన్‌ పూర్తయినట్లు సంగీత దర్శకుడు తమన్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్లో మహేష్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న ఓ కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్‌ బ్యాంక్‌ రికవరీ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం బార్సిలోనాలో పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున చిత్ర బృందం తిరిగి హైదరాబాద్‌ రానున్నట్లు తెలుస్తోంది. సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని