Cinema News: ‘మురుగన్‌’ కథేంటి? - telugu news New Movie Murugan Pooja Ceremony
close
Updated : 18/10/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘మురుగన్‌’ కథేంటి?

రాజీవ్‌, విహారిక జంటగా సతీష్‌ (నాని) తెరకెక్కిస్తున్న చిత్రం ‘మురుగన్‌’. దిరిశాల నరేష్‌ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.    ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు కోటి క్లాప్‌ కొట్టగా.. చక్రదర్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. చిత్ర దర్శకుడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో రాజీవ్‌ మాట్లాడుతూ.. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది’’ అన్నారు. ‘‘నాకిది రెండో సినిమా. నటనకు ఎంతో ప్రాధాన్యముంది’’ అంది నాయిక విహారిక. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఐదేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేస్తున్నా. ఓ వాస్తవ సంఘటనను ఆధారం చేసుకుని ఈ సినిమా తీస్తున్నా’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: శ్రీ వసంత్‌, ఛాయాగ్రహణం: వంశీ.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని