Radhe shyam: విక్రమాదిత్య ఎవరు? - telugu news Radheshyam Teaser will release On Prabhas Birthday
close
Updated : 21/10/2021 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhe shyam: విక్రమాదిత్య ఎవరు?

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీధ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమ కథతో పీరియాడికల్‌ సినిమాగా రూపొందుతోంది. ప్రభాస్‌ ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే పాత్రలో సందడి చేయనున్నారు. మరి ఆయన ఎవరు? ఆయన కథేంటి? అన్నది.. టీజర్‌తో చూపించేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. ఈనెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉదయం 11:16 గంటలకు ఈ ప్రచార చిత్రం విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో కొత్త పోస్టర్‌ పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో ప్రభాస్‌ తీక్షణంగా ఆలోచిస్తూ కనిపించారు. ‘విక్రమాదిత్య ఎవరు?’ అంటూ ఆ ప్రచార చిత్రంపైనా ఓ వ్యాఖ్యను ఉంచారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని