Kartikeya: ఏజెంట్‌ విక్రమ్‌ - telugu news Raja Vikramarka Release Date Announced
close
Updated : 21/10/2021 08:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kartikeya: ఏజెంట్‌ విక్రమ్‌

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. తాన్యా రవిచంద్రన్‌ కథానాయిక. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. 88 రామారెడ్డి నిర్మాత. నవంబర్‌ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎన్‌.ఐ.ఎ ఏజెంట్‌ విక్రమ్‌ పాత్రలో కార్తికేయ నటించిన చిత్రమిది. ఆయన లుక్‌, పాత్రతోపాటు కథనం కొత్తగా ఉంటుంది. స్క్రిప్ట్‌కి అనుగుణంగా ఎక్కువ లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఈ సినిమా కోసం ఉపయోగించే వాహనాలు, గన్స్‌  దగ్గర్నుంచి ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘వాణిజ్య హంగులతోపాటు కొత్తదనం నిండిన యాక్షన్‌ ప్రధాన చిత్రమిది. తొలి సినిమానే అయినా శ్రీసరిపల్లి చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. తొలి   కాపీ సిద్ధమైంది. త్వరలోనే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్‌, తనికెళ్ల భరణి, పశుపతి, హర్షవర్ధన్‌, సూర్య, జెమినీ సురేష్‌, జబర్దస్త్‌ నవీన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, సమర్పణ: ఆదిరెడ్డి.టి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని