PM Modi: మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల - telugu news Slight increase in pm Modi assets
close
Updated : 26/09/2021 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PM Modi: మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. 2020లో రూ.2.85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగి.. రూ.3 కోట్ల 7 లక్షలకు చేరింది. తన తాజా డిక్లరేషన్‌లో మోదీ ఈ వివరాలు పేర్కొన్నారు. చాలా మంది కేంద్ర మంత్రుల్లానే ప్రధానికి కూడా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు లేవు. ప్రభుత్వం నుంచి పొందే జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. ఆ జీతాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టడం, వాటిపై వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(రూ.8.9 లక్షలు), ఎల్‌ఐసీ పాలసీలు(1.5 లక్షలు), ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌లో మోదీకి (2012లో రూ.20 వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్‌ గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో మోదీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఈ విలువే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ విలువ రూ.1.6 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ.1.86 కోట్లకు చేరింది. ప్రధానికి సొంత వాహనం సైతం లేదు.

వాజ్‌పేయీ నుంచి మొదలు..

ప్రజాజీవితంలో పారదర్శకత కోసం ఆస్తుల వెల్లడి ప్రక్రియను.. 2004లో వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లోని రాజకీయనేతలు వారి ఆస్తులు, అప్పులను వెల్లడిస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు సమయంలో కూడా ప్రమాణపత్రంలో ఈవివరాలను పేర్కొంటారు. లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం(2013) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు అదరూ వారి వార్షిక ఆదాయాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది.

ఇంకా ఏమేం ఉన్నాయంటే.. (2021 మార్చి 31 నాటికి)

మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.48 లక్షలు. బ్యాంక్‌లో నిల్వ రూ.1.5 లక్షలు. నగదు రూపంలో రూ.36 వేలు ఉన్నాయి. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ స్థిరాస్తి విలువ రూ. 1.1 కోట్లుగా ఉంది. ఇది ఉమ్మడి ఆస్తి. మరో ముగ్గురికి ఇందులో వాటా ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని