Aamani: అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: ఆమని - telugu news aamani about her career
close
Updated : 24/08/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aamani: అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: ఆమని

హైదరాబాద్‌: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో కుటుంబసభ్యులు.. ముఖ్యంగా బంధువుల నుంచి తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అలనాటి నటి ఆమని అన్నారు. కెరీర్‌ ఆరంభంలోనే ‘జంబలకిడిపంబ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమె తన స్నేహితురాలు, నటి ఇంద్రజతో కలిసి ‘ఆలీతో సరదాగా’లో సందడి చేశారు.

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ట్‌ షో ‘ఆలీతో సరదాగా’. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో ఇంద్రజ, ఆమని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐదేళ్ల వయసు నుంచే తనకి సినిమాలు అంటే ఇష్టమని.. స్కూల్‌లో చదవడం మానేసి శ్రీదేవి, జయప్రద, జయసుధల గురించే ఎక్కువగా ఆలోచించేదాన్ని అని ఆమని తెలిపారు. దొంగిలించిన మామిడికాయలు తినడమంటే తనకెంతో ఇష్టమన్నారు. అనంతరం తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక.. మా కుటుంబానికి ఆ విషయం చెప్పాను. మా బంధువులందరూ విమర్శించారు. ‘అది సినిమాల్లో చేయడమేమిటి?ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు, పెద్ద అందగత్తె ఏం కాదు’’ అని అన్నారని ఆమని తెలిపారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని