ఓటుకు నోటు కేసు.. రేవంత్‌ డ్రైవర్‌, పీఏపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ - telugu news acb special court hearing on vote for note case
close
Updated : 30/07/2021 05:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటుకు నోటు కేసు.. రేవంత్‌ డ్రైవర్‌, పీఏపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి డ్రైవర్‌, పీఏపై అనిశా ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్‌ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సమన్లు తీసుకున్నప్పటికీ ఇవాళ విచారణకు గైర్హాజరు కావడంతో ఇద్దరికీ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన అనిశా కోర్టు... ఆగస్టు 9న హాజరుకావాలని స్పష్టం చేసింది. నిందితుల్లో ఉదయ్‌సింహా ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను అనిశా కోర్టు రేపటికి వాయిదా వేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని