Shiva Shankar: శివశంకర్‌ మాస్టర్‌ వైద్యానికి ధనుష్‌ ఆర్థిక సాయం - telugu news actor dhanush helped for shivashankar treatment
close
Published : 26/11/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shiva Shankar: శివశంకర్‌ మాస్టర్‌ వైద్యానికి ధనుష్‌ ఆర్థిక సాయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయిన కోలీవుడ్‌ నటుడు ధనుష్‌ తన ఉదారత చాటుకున్నారు. శివశంకర్‌ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. శివశంకర్‌ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల కొవిడ్‌ బారినపడిన శివశంకర్‌ గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. చికిత్సకు తగిన డబ్బు తమ వద్ద లేకపోవడంతో శివశంకర్‌ కుటుంబసభ్యులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు నటుడు సోనూసూద్‌ గురువారం ఉదయం తెలియజేశారు. తాజాగా ధనుష్‌ ముందుకొచ్చారు. శివశంకర్‌ సతీమణి, పెద్దకుమారుడికి సైతం కరోనా వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఎన్నో సూపర్‌హిట్‌ గీతాలకు నృత్యాలు సమకూర్చిన శివశంకర్‌ మాస్టర్‌ పలు సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని