Pawan Kalyan: సాయిధరమ్‌ తేజ్‌ గురించి పవన్‌, త్రివిక్రమ్‌ ఏమన్నారంటే? - telugu news actor pawan kalyan and director trivikram appreciate saidharam tej
close
Published : 03/10/2021 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan Kalyan: సాయిధరమ్‌ తేజ్‌ గురించి పవన్‌, త్రివిక్రమ్‌ ఏమన్నారంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. దేవ కట్టా దర్శకుడు. సాయిధరమ్‌ తేజ్‌ కోరిక మేరకు ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ‘త్వరలోనే మీ ముందుకు వస్తా’ అని ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని