Rana: కొత్త అవతారమెత్తిన రానా..! - telugu news actor rana will introduce another talent
close
Published : 27/09/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rana: కొత్త అవతారమెత్తిన రానా..!

ఇంటర్నెట్ డెస్క్‌: యువ నటుడు రానా కొత్త అవతారమెత్తారు. ఆయనలోని మరో కోణాన్ని త్వరలోనే పరిచయం చేయనున్నారు. అదేంటంటే.. రానా ‘విరాటపర్వం’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రానా తన మాటనే కాదు, పాటనీ విపిపించబోతున్నారు. ఇందులోని విప్లవాత్మక గీతం కోసం రానా తొలిసారి గాయకుడిగా మారారు. మరి రానా పాడిన ఆ పాట వినాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఈ వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మరో విడుదల తేదీని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది. 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని