Tollywood Drugs Case: నటుడు తనీష్‌ను 7గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు - telugu-news actor tanish ed investigation ended
close
Updated : 17/09/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Drugs Case: నటుడు తనీష్‌ను 7గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట సినీనటుడు తనీష్‌ విచారణ ముగిసింది. తనీష్‌ను సుమారు 7గంటల పాటు అధికారులు విచారించారు. బ్యాంకు ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? ఎఫ్‌క్లబ్‌లో మాదకద్రవ్యాలు సరాఫరా చేస్తారా? డ్రగ్స్‌ వినియోగించే సెలబ్రిటీలు మీకు ఎవరైనా తెలుసా? అంటూ తనీష్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం తనీష్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ మళ్లీ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదు. ఈడీ అధికారులు పిలిస్తే విచారణకు వస్తా’’ అని తెలిపారు. మరో వైపు డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు రావాలని ఆదేశించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని