Porn Video Rocket: రాజ్‌కుంద్రా ఫోన్‌ నంబర్‌ నా దగ్గర లేదు : ఫ్లోరా సైనీ - telugu news actress flora saini clarifies the air in raj kundra case
close
Published : 28/07/2021 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Porn Video Rocket: రాజ్‌కుంద్రా ఫోన్‌ నంబర్‌ నా దగ్గర లేదు : ఫ్లోరా సైనీ

ముంబయి: ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘నరసింహానాయుడు’, ‘సొంతం’, ‘ప్రేమతో రా’, ‘143’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముంబయి చిన్నది ఫ్లోరా సైనీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు గత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. పోర్న్‌ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కల్పిస్తూ రాజ్‌కుంద్రా ఒకానొక సమయంలో ఫ్లోరా సైనీని కలిశారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా, రాజ్‌కుంద్రాకు సన్నిహితుడైన ఉమేశ్‌ ఫోన్‌లో ఫ్లోరా సైనీతో చేసిన వాట్సాప్‌ చాట్‌లు అందుబాటులో ఉన్నాయని అందరూ చెప్పుకుంటున్నారు.

కాగా, సదరు వార్తలపై తాజాగా నటి స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని ఆమె తెలిపారు. ‘అందరూ అనుకుంటున్నట్లు రాజ్‌కుంద్రాతో కానీ, ఉమేశ్‌తో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. నా వద్ద వాళ్ల ఫోన్‌ నంబర్లు కూడా లేవు. హాట్‌షాట్స్‌ కోసం చేయనున్న సిరీస్‌లో నటిస్తారా అంటూ కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి. కంటెంట్‌ గురించి తెలుసుకుని.. నటించనని చెప్పేశాను. కానీ, ఇప్పుడు ఈ పోర్న్‌ రాకెట్‌ కేసులోకి నా పేరు లాగడం బాధగా అనిపిస్తుంది. పోర్న్‌ రాకెట్‌లో భాగమయ్యానంటూ అందరూ అవమానపరుస్తున్నారు. ఫిల్మ్‌బ్యాక్‌గ్రౌండ్‌ లేదు కాబట్టే నా పేరుని ఈ వివాదంలోకి లాగారు. ఇలాంటి పబ్లిసిటీ నాకవసరం లేదు’ అని ఆమె తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని