Samantha: కోర్టుకెళ్లిన సమంత.. యూట్యూబ్‌ ఛానళ్లపై పరువు నష్టం దావా - telugu news actress samantha files defamation case on youtube channels
close
Published : 21/10/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: కోర్టుకెళ్లిన సమంత.. యూట్యూబ్‌ ఛానళ్లపై పరువు నష్టం దావా

హైదరాబాద్‌: తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. ఈ రోజు సాయంత్రం సమంత తరఫు న్యాయవాది తమ వాదన వినిపించనున్నారు. నాగ చైతన్యతో వివాహ బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని