TPCC: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు పార్లమెంట్‌ స్థానాల బాధ్యతలు - telugu news additional charges to tpcc working presidents
close
Published : 03/08/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TPCC: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు పార్లమెంట్‌ స్థానాల బాధ్యతలు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు పార్లమెంట్‌ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనుబంధ సంఘాలను కలుపుతూ బాధ్యతలు ఇచ్చారు.టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజహరుద్దీన్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు.

గీతారెడ్డికి సికింద్రాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు పార్టీ అనుబంధ విభాగాలు ఎన్‌ఎస్‌యూఐ, మేధావుల విభాగం, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ బాధ్యతలను అప్పగించారు. అంజన్‌కుమార్‌ యాదవ్‌కు నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మెదక్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలు.. యువజన కాంగ్రెస్‌, మైనారిటీ, మత్స్యకార విభాగాలను అప్పజెప్పారు. అజహరుద్దీన్‌కు ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సోషల్‌ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు. జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్‌, భువనగిరి, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు మహిళా కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ, కార్మిక విభాగం బాధ్యతలు అప్పగించారు. మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సేవాదళ్‌ విభాగాలను అప్పజెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని