Afghanistan Cricket: ప్రపంచకప్‌ ముందు అఫ్గాన్‌కు గట్టి షాక్‌.. కెప్టెన్‌గా తప్పుకొన్న రషీద్‌ఖాన్‌ - telugu news afghanistan cricket rashid khan step down from t20 cricket
close
Updated : 10/09/2021 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Afghanistan Cricket: ప్రపంచకప్‌ ముందు అఫ్గాన్‌కు గట్టి షాక్‌.. కెప్టెన్‌గా తప్పుకొన్న రషీద్‌ఖాన్‌

(Photo: Rashid Khan Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ముందు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న ప్రముఖ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. గతరాత్రి అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు తనని సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించాడు.

‘అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉన్న నాకు.. ప్రపంచకప్‌ జట్టు ఎంపికచేసే ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. అలాంటిది అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు కానీ, సెలెక్షన్‌ కమిటి కానీ నన్ను సంప్రదించకుండానే జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా. అయితే, అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుకు ఆడటం ఎప్పటికీ నాకు గర్వకారణమే’ అని రషీద్‌ పేర్కొన్నాడు. కాగా, జులైలో ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అసదుల్లా ఖాన్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. క్రికెట్‌తో సంబంధంలేని వ్యక్తుల ప్రమేయం బోర్డులో ఎక్కువైందని ఆయన వెల్లడిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇటీవలి కాలంలో ఆ జట్టులో ఆడకపోయినా.. పలువురిని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేశారు. ఈ అంశం వివాదాస్పదంగా మారింది. 2019లో ఏడాది పాటు నిషేధానికి గురైన మహ్మద్‌ షాహ్జాద్‌తో పాటు పేస్‌బౌలర్లు షాపూర్‌ జద్రాన్‌, దావ్లత్‌ జద్రాన్‌, 2016లో చివరి మ్యాచ్‌ ఆడిన హమీద్‌ హసన్‌ లాంటి ఆటగాళ్లను ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలోనే రషీద్‌ అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

అఫ్గాన్‌ ప్రకటించిన జట్టు: రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, కరీమ్‌ జనత్‌, హజ్రతుల్లా జాజాయ్‌, గుల్బాడిన్‌ నైబ్‌, ఉస్మాన్‌ ఘని, నవీన్‌ ఉల్‌ హక్‌, అస్ఘర్‌ అఫ్గాన్‌, హమీద్‌ హసన్‌, మహ్మద్‌ నబి, షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, నజీబుల్లా జద్రాన్‌, దావ్లత్‌ జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, షాపూర్‌ జద్రాన్‌, మహ్మద్‌ షహ్జాద్‌, కాయిస్‌ అహ్మద్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని