అశ్విన్‌బాబు కొత్త అవతారం ‘హిడింబ’ - telugu news ahwin babu new film title poster and first look
close
Published : 01/08/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశ్విన్‌బాబు కొత్త అవతారం ‘హిడింబ’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జీనియస్‌’, ‘రాజుగారి గది 2’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో మెప్పించిన నటుడు అశ్విన్‌బాబు. ప్రస్తుతం ఆయన అనిల్‌ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. నేడు అశ్విన్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని టైటిల్‌, అశ్విన్‌ ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘హిడింబ’ అనే విభిన్న పేరుని ఖరారు చేశారు. నుదుటిపై నెత్తుటి మరకలతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు అశ్విన్‌. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో అశ్విన్‌ సరసన నందితా శ్వేత నటిస్తోంది. రఘుకుంచె, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ విఘ్నేశ్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకంపై గంగాపట్నం శ్రీధర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: వికాస్‌, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌, కూర్పు: ఎం.ఆర్‌. వర్మ.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని