Nootokka Jillala Andagadu: ‘అలసిన సంచారి’ ఫుల్‌ వీడియో చూశారా! - telugu news alasina sanchari full video from nootokka jillala andagadu
close
Published : 19/08/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 Nootokka Jillala Andagadu: ‘అలసిన సంచారి’ ఫుల్‌ వీడియో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు. ‘అలసిన సంచారి’ అనే గీతాన్ని (ఫుల్ వీడియో) చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. శ్రీవిశ్వ రచించిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. కథానాయకుడు బాధ నుంచి తేరుకుని విజయంవైపు అడుగేసే సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు శ్రీనివాస్‌. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని