Virat Kohli - Anushka Sharma: కోహ్లీ నిర్ణయంపై అనుష్క రియాక్షన్‌ ఇది - telugu news anushka sharma reacted with heart emoji after virat kohlis announces his decision to step out as t20 indian captain
close
Published : 17/09/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli - Anushka Sharma: కోహ్లీ నిర్ణయంపై అనుష్క రియాక్షన్‌ ఇది

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ గురువారం అందర్నీ షాక్‌కు గురిచేస్తూ టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లతో సహా అతడి సతీమణి అనుష్క శర్మ సైతం స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కోహ్లీ పంచుకున్న లేఖను పోస్టు చేసి దానికి హార్ట్‌ (లవ్‌ సింబల్‌) ఎమోజీ జత చేశారు. కాగా, పనిభారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ అనుష్క ఇలా స్పందించడం గమనార్హం.

కోహ్లీ నిర్ణయంపై ఎవరేమన్నారంటే..

ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీ20 బాధ్యతల నుంచి తప్పుకోవడం అనేది నిజంగా షాక్‌కు గురి చేసింది. కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌ సాధించి అతడికి ఎప్పటికి గుర్తుండేలా అందిస్తే అద్భుతంగా ఉంటుంది. కోహ్లీ తర్వాత టీమ్‌ఇండియా గొప్ప విజయాలతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా.-ఇర్ఫాన్‌ పఠాన్‌

చివరికి కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌ అతడికి మొదటిది, ఆఖరిది కూడాను. నవంబర్‌ 14న అతడు ప్రపంచకప్‌ అందుకోవాలని ఆశిద్దాం.  -ఆకాశ్‌ చోప్రా

కోహ్లీ.. ఈ టీ20 ప్రపంచకప్‌ సాధించి దేశానికి కీర్తి, ప్రతిష్ఠలు తీసుకువస్తావని ఆశిస్తున్నా.-వెంకటేశ్‌ ప్రసాద్‌

విరాట్‌ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేం నీతోనే ఉంటాం. నీ సారథ్యంలో మనం ఈ ప్రపంచకప్‌ గెలవబోతున్నామని బలంగా నమ్ముతున్నా. ఆల్‌ ది బెస్ట్‌. -మునాఫ్‌ పటేల్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని