కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు వారికి లేదు: సోము - telugu-news-ap bjp leaders meets central ministers in delhi
close
Published : 04/08/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు వారికి లేదు: సోము

అమరావతి: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హరిదీప్‌ పూరీని భాజపా నేతలు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చట్టాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్‌ రూ.25 వేల కోట్లు అప్పు చేసిందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆర్‌బీఐ నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రానికి తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం చేరుకుందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సోము వీర్రాజు వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని