AP News: 4 నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు - telugu news ap ngo president comments on salaries in ap
close
Updated : 29/07/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: 4 నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందాలని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని... ఎప్పుడు వస్తాయో తెలియక కూరగాయలు, పాల వారి దగ్గర చులకన భావన ఏర్పడుతోందన్నారు. నాలుగు నెలలుగా జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని శ్రీనివాసరావు చెప్పారు. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు.. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని