AP News: ఏపీలో పోలీస్‌ వ్యవస్థ ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరం: అచ్చెన్న - telugu news ap tdp president atchennaidu comments
close
Updated : 21/09/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: ఏపీలో పోలీస్‌ వ్యవస్థ ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరం: అచ్చెన్న

అమరావతి: ఏపీలో ఘోరాలు జరుగుతున్నా పోలీస్‌ వ్యవస్థ ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోయాయని చెప్పారు. దాడులకు యత్నించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికారంతో దుశ్చర్యకు పాల్పడితే ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. గుంటూరు జిల్లా కొప్పర్రులో తెదేపా మహిళా నేత శారద ఇంటిపై దాడి చేసి ఇల్లు, బైక్‌లు తగులబెట్టారని తెలిపారు. ఘటనాస్థలిలో పోలీసులు ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారని అచ్చెన్న మండిపడ్డారు.

తెదేపా కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు జరుగుతున్నందుకేనా రాష్ట్ర పోలీసులకు అవార్డులు? అని నిలదీశారు. శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం అని అచ్చెన్న హెచ్చరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని