Tokyo Olympics: సీడింగ్‌ రౌండ్లో దీపిక తడబాటు.. ఆమె ప్రత్యర్థి ఒలింపిక్స్‌ రికార్డు - telugu news archery deepika ninth in ranking round koreans dominate
close
Published : 23/07/2021 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: సీడింగ్‌ రౌండ్లో దీపిక తడబాటు.. ఆమె ప్రత్యర్థి ఒలింపిక్స్‌ రికార్డు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం మొదలైంది. మహిళల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి శుభారంభం చేసింది. సీడింగ్‌ కోసం నిర్వహించిన పోటీల్లో ఆమె తొమ్మిదో స్థానంలో నిలిచింది. కొరియా అమ్మాయి, దీపిక ప్రధాన ప్రత్యర్థి ఆన్‌ సాన్‌ ఒలింపిక్స్‌ రికార్డు నమోదు చేసింది.

ప్రపంచ నంబర్‌ వన్‌ దీపికా కుమారి 663 పాయింట్లు సాధించగా ఆన్‌ సాన్‌ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్లో భూటాన్‌కు చెందిన కర్మతో దీపిక తలపడనుంది. ప్రస్తుతం ఆమె ర్యాంకు 193 కావడం గమనార్హం. ఆమెపై విజయం సాధించడం భారత ఆర్చర్‌కు సులువే.

ప్రధాన ప్రత్యర్థి ఆన్‌ సాన్‌తో దీపిక క్వార్టర్‌ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోలోనే 2019లో జరిగిన ఒలింపిక్‌ అర్హత పోటీల్లో దీపికను ఆన్‌సాన్‌ వరుస సెట్లలో ఓడించింది.

ప్రస్తుత పోటీల్లో దీపిక తొలి అర్ధభాగంలో 36, ద్వితీయార్ధంలో 36 బాణాలు సంధించింది. పది మార్కులకు 30 బాణాలు గురిపెట్టగా.. మధ్య బిందువు (ఎక్స్‌)కు 13 బాణాలు ఎక్కుపెట్టింది. ఆన్‌ సాన్‌ 10కి 36, ఎక్స్‌కు 16 బాణాలు గురి పెట్టడం గమనార్హం. తొలి అర్ధభాగంలో బాగానే ఆడిన దీపిక రెండో భాగంలోనే కాస్త గురి తప్పింది.

‘నా ప్రదర్శన  మధ్యస్థంగా ఉంది. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. మెరుగ్గా ఆడేందుకు నా షాట్లను నియంత్రించా. నాతో నేను మాట్లాడుకున్నా. నా భావోద్వేగాలను నియంత్రించుకొనేందుకు ప్రయత్నించా. తర్వాతి రౌండ్లలో మెరుగ్గా ఆడతా’ అని దీపిక తెలిపింది.

విలువిద్యలో 70 మీటర్ల దూరంలోని లక్ష్యానికి 72 బాణాలు గురి పెట్టాలి. మొత్తంగా 12 సిరీసులు ఉంటాయి. ఒక్కో సిరీసులో 6 బాణాలు ఉంటాయి. ర్యాంకింగ్స్‌ రౌండ్లో పోటీదారుల స్థానాలను నిర్ణయిస్తారు. ఇక్కడ వచ్చిన సీడింగ్‌తో అధికారిక మ్యాచులు సాయంత్రం మొదలవుతాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని