Tokyo Olympics: విలువిద్యలో అతాను  35, ప్రవీణ్‌ 31, తరుణ్‌ 37 - telugu news atanu das not upto the mark behind pravin jadhav
close
Published : 23/07/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: విలువిద్యలో అతాను  35, ప్రవీణ్‌ 31, తరుణ్‌ 37

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల వ్యక్తిగత విలువిద్య పోటీల్లో భారత క్రీడాకారులు మోస్తరు ప్రదర్శన చేశారు. 72 బాణాల సీడింగ్‌ పోటీల్లో ప్రవీణ్‌ జాదవ్‌ 31, అతాను దాస్‌ 35, తరుణ్‌దీప్‌ రాయ్‌ 37 స్థానాల్లో నిలిచారు.

తొలి అర్ధభాగంలో గట్టిపోటీనిచ్చిన అతాను దాస్‌ ఆఖరికి 653 పాయింట్లు మాత్రమే సాధించాడు. 10 పాయింట్లకు 24, లక్ష్యానికి (ఎక్స్‌) 7 సార్లు మాత్రమే గురిపెట్టాడు. ప్రతి సెషన్లో తొలి మూడు బాణాలను బాగానే సంధించిన అతడు మిగిలిన వాటిద్వారా ఎక్కువ పాయింట్లు రాబట్టలేదు.

ప్రవీణ్‌ జాదవ్‌ 656 పాయింట్లు సాధించాడు. 10 పాయింట్లకు 22, లక్ష్యానికి 5 బాణాలు ఎక్కుపెట్టాడు. ఇక తరుణ్‌దీప్‌ 652 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 10 పాయింట్లకు 26, లక్ష్యానికి 6 బాణాలు గురి పెట్టాడు. ఇప్పుడు సాధించిన ర్యాంకుల ఆధారంగానే తొలిరౌండ్లో ప్రత్యర్థులను నిర్ణయిస్తారు. ఈ ముగ్గురి పాయింట్లను కలిపి బృంద ర్యాంకు ఇస్తారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన పాయింట్ల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని