Crime news: అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు సాగుదారులు - telugu news attack on forest staff
close
Published : 17/09/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు సాగుదారులు

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్‌ అటవీశాఖ రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై పోడు సాగుదారులు పెట్రోల్‌ పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.  పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు గురువారం సాయంత్రం అటవీ అధికారులు పందిపంపుల గ్రామానికి వెళ్లారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని నిరసన చేపట్టిన  పోడు సాగుదారులు ఒక్కసారిగా దాడికి దిగారు. పెట్రోల్‌ పోసి దాడికి పాల్పడ్డారు. గతంలోనూ అధికారులు పోడు భూముల్లో నాటిన మొక్కలను సాగుదారులు తొలగించారు. దాడిలో స్వల్పంగా గాయపడిన  అటవీ అధికారి దివ్య భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని