Bangarraju: నాగార్జున- చైతన్య.. సోగ్గాళ్ల సందడి షురూ - telugu news bangarraju movie shoot begins nagarjuna nagachaitanya
close
Published : 25/08/2021 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bangarraju: నాగార్జున- చైతన్య.. సోగ్గాళ్ల సందడి షురూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకుడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలు. బుధవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభినట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. ‘సోగ్గాళ్ల షూటింగ్‌ బిగిన్స్‌’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో రెండు బుల్లెట్‌లు దర్శనమిచ్చాయి. పంటపొలాలు, తోరణాలతో రూపొందించిన ఈ పోస్టర్‌ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. 2016 సంక్రాంతికి విడుదలై, ఘన విజయం అందుకున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతోంది. జీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలోనూ నాగార్జున నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ‘లవ్‌స్టోరి’ సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని