Bigg boss 5: ఆమె లేడీ నారద.. చేతకాని దానిలా ఆడకు.. కూతకెళ్లను కోతకే.. - telugu news bangaru kodipetta task sunny vs priya bigg boss 5
close
Updated : 20/10/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss 5: ఆమె లేడీ నారద.. చేతకాని దానిలా ఆడకు.. కూతకెళ్లను కోతకే..

హైదరాబాద్‌: సోమవారం నామినేషన్ ప్రక్రియపై హౌస్ మేట్స్ మధ్య చర్చ జరిగింది. ‘నీకు వచ్చిన పవర్‌తో నీ ఫ్రెండ్స్‌ని కాపాడుకోవాలనుకున్నప్పుడు, నీ ప్రత్యర్థిని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా’ అంటూ.. సన్నీకి మానస్ హితబోధ చేశాడు. ‘రవిని నేను నామినేట్‌ చేయలేదు. చెత్త రీజన్‌ చెప్పి ప్రియానే నామినేట్‌ చేసింది. నాతో గేమ్‌ ఆడాలనుకున్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా. వాళ్లు ఆడితే గేమ్‌.. నేడు ఆడితే క్రైమా?’ అంటూ సన్నీ ప్రశ్నించాడు. మరోవైపు శ్రీరామ్‌, ప్రియాంక, ప్రియలు.. కాజల్‌ గురించి మాట్లాడుకున్నారు. ‘‘నీకు దమ్ముంటే గేమ్ ఆడు. సేఫ్ గేమ్ ఆడకు. అందుకే ఆమె(కాజల్‌)ను లేడీ నారద, డ్రామా క్వీన్‌ అంటాను. ప్రియ దగ్గరకు కాజల్‌ వెళ్లి ‘మనం గొడవ పడదాం. అప్పుడు జనాలు చూస్తారు అన్నారట. ఎవరైనా కావాలని గొడవ పడతారా. ఛీ.. ఛీ’’ అంటూ కాజల్‌ గురించి ప్రియాంక చెప్పుకొచ్చింది.

వాడు తప్పు చేయలేదు

ప్రియ చెప్పిన సిల్లీ రీజన్‌కు నామినేట్ అయిన షాక్‌ నుంచి రవి ఇంకా తేరుకోలేకపోయాడు. ‘చేసిన తప్పు ఒప్పుకోడు’ అని సన్నీ గురించి రవి అనగా, ‘వాడు తప్పు చేయలేదు రవి, ఫ్రెండ్ కోసం ఫ్రెండ్‌ని సేవ్ చేయడానికి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంతే’ అని కాజల్‌ అనేసరికి రవి నోరెళ్ల బెట్టాడు. ఇంట్లో జరిగిన పరిణామాలతో ప్రియాంక అలిగి అన్నం తినడం మానేయడంతో మానస్‌ ఆమెను ఓదార్చాడు. అనంతరం అన్నం తినిపిస్తూ ‘అమ్ము నాతో బాగా తినిపించుకునేది’ అని మానస్‌ అంటే, ‘వేళ్లు కూడా వదిలేది కాదు కదా’ అని ప్రియాంక కౌంటర్‌ ఇచ్చింది.

కీర్తి సురేశ్‌, ఇలియానా వాళ్లనే నేను చూడలేదు

కాజల్‌ తీరుపై ప్రియ, అనీ మాస్టార్‌, శ్రీరామ్‌, రవి చర్చ పెట్టారు. ‘నేను ఎక్కడున్నా మీ కళ్లు నాపైనే ఉంటాయి’ అని కాజల్‌ చెప్పిందంటూ అనీ మాస్టర్‌ వివరించారు. ‘కీర్తి సురేశ్‌, ఇలియానా, జెనీలియా, పూజాహెగ్డేలాంటి పెద్ద హీరోయిన్స్‌నే నేను చూడలేదు. కాజల్‌ను చూస్తూ ఉంటానా’ అని చెప్పుకొచ్చింది. మొదటిసారి ఇంట్లోకి వచ్చినప్పుడు కాజలే తనకు ఇల్లు చూపించిందని, పక్క నుంచి హగ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తే పక్కకు తోసేసిందని రవి వివరించాడు. ‘నీ పేరు చెబితే నీకు ఎఫెక్ట్‌ అవుతుందని రవి పేరు చెప్పా. నేనైతే స్ట్రాంగ్‌ రీజన్‌ తీసుకుంటా. ఈరోజుకీ నాకు కాజల్‌ అంటే ఇష్టం లేదు. ఒకవేళ ఆమె  కెప్టెన్‌ టాస్క్‌లో ఉంటే మాత్రం సపోర్ట్‌ చేస్తా’ అని మానస్‌తో ప్రియ చెప్పుకొచ్చింది. ‘మానస్‌ లేకపోతే సన్నీ స్టుపిడ్‌ గేమ్‌ ఆడతాడు. ప్రతిసారీ అతడిని కంట్రోల్‌ చేస్తున్నాడు’ అని కిచెన్‌లో ప్రియ-ప్రియాంకలు మాట్లాడుకున్నారు.

బంగారు కోడిపెట్ట.. సన్నీ-ప్రియ రచ్చ

కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ సందర్భంగా కోడిగుడ్లను ఏరుకునేందుకు హౌస్‌మేట్స్‌ పోటీ పడ్డారు. ఈ టాస్క్‌ మొత్తం సన్నీ vs ప్రియల మధ్య జరిగింది. సన్నీ గుడ్లను ప్రియ దొంగిలించి మానస్‌కు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘నా ఎగ్స్‌ జోలికి వస్తే ఊరుకోను’ అని సన్నీ అంటే ‘దొంగతనం చేస్తా. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’ అని ప్రియ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఆ తర్వాత సన్నీ బుట్టలోని గుడ్లను ప్రియ దొంగిలించింది. దీంతో కోపం వచ్చినా సన్నీ కంట్రోల్‌ చేసుకున్నాడు. ‘చేతకాని వాళ్లలా ఆడకు. మంచిగా ఆడు’అని అంటే ‘ఆడటం వచ్చిన వాళ్లే దొంగతనం చేసినా చెబుతారు’ అంటూ ప్రియ కౌంటర్‌ ఇచ్చింది. ‘చూపిస్తా ఉగ్రస్వరూపం వస్తుంది’, అని సన్నీ అంటే ‘ఓహ్‌ మస్తు చూసేసినా’ అంటూ ప్రియ తన యాటిట్యూడ్‌ను చూపించింది. ‘కూతకు వెళ్లను కోతకే వెళ్తా(దొంగతనం చేస్తా)’ అంటూ సిరికి ప్రియ చెప్పడం నవ్వులు పూయించింది. ఇక దూరం నుంచి హౌస్‌ మేట్స్‌ను చూస్తూ జెస్సీ, షణ్ముఖ్‌ల కామెంటరీ నవ్వులు పూయించింది. ఇక మొదటి రౌండ్‌లో 32 గుడ్లు సంపాదించి మానస్‌ విజేతగా నిలిచాడు.

షణ్ముఖ్‌ అనుమానం.. ఏడ్చిన సిరి..

గుడ్ల కోసం తమ బెడ్స్‌ను తనిఖీ చేయటం నచ్చలేదని సిరితో షణ్ముఖ్ అనడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. తాను అలా చేయలేదని వివరించే ప్రయత్నం చేసింది. జెస్సీ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. కాజల్‌ గురించి ప్రియ, ప్రియాంకలు మాట్లాడుకున్నారు. ఏది చేద్దామన్నా కాజల్‌ అడ్డుపడుతోందని, కనీసం గుడ్‌ మార్నింగ్‌ చెబుదామన్నా యువర్స్‌ లవింగ్లీ చదువుతుందని ప్రియ వెటకారంగా మాట్లాడింది.

రవి ఎలిమినేట్‌ అవడు..

ఈ వారం నామినేషన్స్‌ ఉన్న వాళ్లలో ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై జెస్సీ-సిరిల మధ్య టాక్‌ నడిచింది. రవి ఎలిమినేట్‌ కాడని జెస్సీ అన్నాడు. బాయ్స్‌లో తాను, శ్రీరామ్‌లకు ఛాన్స్‌ ఉందని, లేడీస్‌లో కాజల్‌ వెళ్లవచ్చని జోస్యం చెప్పాడు. ఇక మానస్‌ బాధపడుతుంటే బయటకెళ్లాక లైఫ్‌ టైం బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉంటామంటూ సన్నీ ఓదార్చాడు. ఇక బుధవారం ఎపిసోడ్‌లో ప్రియ- సన్నీల గొడవ తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సన్నీ బుట్టలోని గుడ్లను దొంగిలించేందుకు ప్రియ ప్రయత్నించగా అతడు అడ్డుకున్నాడు. ‘ఫిజికల్‌ అయితే, చెంప పగలగొడతా’ అంటూ ప్రియ వార్నింగ్‌ ఇచ్చింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. వారిని హౌస్‌మేట్స్‌ ఆపేందుకు ప్రయత్నించారు. మరి, ఈ గొడవ ఎలా సద్దు మణిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని