BheemlaNayak: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆన్‌ ఫైర్‌ - telugu news bheemlanayak in breaktime
close
Updated : 21/08/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BheemlaNayak: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆన్‌ ఫైర్‌

బ్రేక్‌ టైమ్‌లో భీమ్లానాయక్‌ ఇలా..!

హైదరాబాద్‌: వరుస సినిమాలతో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లానాయక్‌’తో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడంతో పవన్‌ గన్‌ చేతపట్టారు. టార్గెట్‌ని ఎయిమ్‌ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. ‘భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌’ అని పేర్కొంది.

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ సిద్ధమవుతోంది. మాతృకలో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని