Big Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ వచ్చేది ఎప్పుడంటే? - telugu news big boss season 5 starting from september
close
Published : 28/08/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Big Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ వచ్చేది ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఈ కార్యక్రమం గత నాలుగు సీజన్లతో మంచి వినోదం పంచుతూ వస్తోంది. దీంతో ఐదో సీజన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే ఆసక్తి ప్రేక్షకల్లో మొదలైంది. ఆ ఎదురుచూపులకి తెరపడింది. ‘బిగ్‌బాగ్‌’ ఎప్పుడొస్తున్నాడో తెలిసింది. సెప్టెంబరు 5 నుంచి ఈ కార్యక్రమం సందడి చేయనుంది. తొలి ఎపిసోడ్‌ ఆరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. తదుపరి ఎపిసోడ్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. సీజన్‌ 5కి ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 3, 4 సీజన్లలో హోస్ట్‌గా ప్రతి ఒక్కరినీ అలరించిన నాగార్జున.. మరోసారి వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు ఎవరా? అని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఈ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని