Big Boss Telugu5: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’.. తొలి మెరుపుని చూశారా! - telugu news bigboss season 5 logo released
close
Published : 01/08/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Big Boss Telugu5: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’.. తొలి మెరుపుని చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ఐదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘బిగ్‌బాస్‌ తెలుగు5’ కొత్త లోగోతో కూడిన వీడియోను విడుదల చేసింది ‘స్టార్‌మా’ బృందం. త్వరలోనే కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్టు తెలిపింది. అయితే సీజన్‌ 5కి హోస్ట్‌ ఎవరనేదే ఆసక్తికర ప్రశ్న. తొలి సీజన్‌లో ఎన్టీఆర్‌, రెండో సీజన్‌లో నాని, మూడు, నాలుగు సీజన్లలో అక్కినేని నాగార్జున తమ వాగ్ధాటి, చతురతతో హోస్ట్‌గా అందరి మనసులు దోచారు. సీజన్‌ 5కి సంబంధించి.. ఓ వైపు అక్కినేని నాగార్జున పేరు వినిపిస్తుండగా మరోవైపు దగ్గుబాటి రానా పేరూ ప్రచారంలో నిలిచింది. ఈ ఇద్దరిలో ఆ అవకాశం ఎవరు అందుకున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. హోస్ట్‌ మాత్రమే కాదు కంటెస్టెంట్ల వివరాలపైనా ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని