Big Boss OTT: ‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌ డ్రెస్సుపై విమర్శలు..! - telugu news bigg boss ott contestant urfi javed trolled by netizens
close
Updated : 04/09/2021 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Big Boss OTT: ‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌ డ్రెస్సుపై విమర్శలు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి వస్త్రధారణపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇదేం డ్రెస్‌..’ అంటూ నెగెటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. ఆమె ఎవరంటే.. హిందీ ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’ కంటెస్టెంట్‌ ఉర్ఫి జావేద్‌. అసలేమైందంటే.. ముంబయి విమానాశ్రయంలో ఆమె కనబడగానే కొందరు తమ కెమెరాలతో క్లిక్‌మనిపించారు. వీడియోలూ తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. నీలిరంగు బ్రాండెడ్‌ జీన్‌ ప్యాంటు, చొక్కా ధరించి నవ్వులు చిందిస్తూ కనిపించిందామె. అయితే, అందులో ఏముంది?అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. తను వేసుకున్న షర్ట్‌ కాస్త విభిన్నంగా ఉంటుంది. లోదుస్తులు కనిపించేలా ఆమె ఇలా స్టైలిష్‌ లుక్‌లో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారు?’, ‘ఇది ఫ్యాషనా?’, ‘భారతీయ సంస్కృతి, సంప్రదాయం మంటకలిశాయి’, ‘ఇది చాలా అసభ్యకరం’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

2016లో టీవీ కార్యక్రమం ‘బడే భయ్యా కీ దుల్హానియా’తో ఉర్ఫి నటిగా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ‘మేరీ దుర్గ’, ‘పంచ్‌ బీట్ సీజన్‌’ తదితర సిరీస్‌లతో సందడి చేసింది. ఈ ఏడాది ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, 8వ రోజునే బయటకి వచ్చేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని