Bigg Boss Telugu 5: హౌస్‌లో ఉన్న గుంటనక్క ఎవరో చెప్పేసిన లహరి! - telugu news bigg boss telugu 5 contestant lahari about housemates
close
Published : 28/09/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: హౌస్‌లో ఉన్న గుంటనక్క ఎవరో చెప్పేసిన లహరి!

హైదరాబాద్‌: ప్రియతో తనకెలాంటి గొడవలూ లేవని, ఇద్దరం కలిసి రెండు, మూడు సినిమాలు కూడా చేశామని బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన లహరి తెలిపింది. ‘బిగ్‌బాస్‌ బజ్‌’లో పాల్గొన్న ఆమె బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరియానాతో జరిగిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. ప్రియ, రవి కొన్నిసార్లు తాము సీనియర్లు అన్న భావనతో ఉంటారని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా హౌస్‌లోని వివిధ వ్యక్తుల గురించి తన అభిప్రాయాలను అడగ్గా కొందరిపై తనకున్న అభిప్రాయాన్ని ఇలా చెప్పుకొచ్చింది. మూడు వారాలైనా మరికొందరి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయానని చెప్పింది. ‘‘రవి విషయంలో నిన్నటి వరకూ ఉన్న అభిప్రాయానికీ నేడు ఉన్న అభిప్రాయానికి తేడా ఉంది. నామినేషన్స్‌ సందర్భంగా గొడవ జరిగిన తర్వాత రవితో మాట్లాడాను ‘పొరబాటున నువ్వు ఏమైనా అన్నావా’ అని అడిగాను. ‘లేదు లహరి’ అని చెప్పాడు. ప్రియ మాటలను బట్టి చూస్తే, రవి తప్పకుండా అనే ఉంటారని అనిపించింది. అయితే, త్వరగా ఒక నిర్ణయానికి రావడం సరైనది కాదనిపించింది. కేవలం సినిమాల్లో నటించాలనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. యాంకరింగ్‌ ఫీల్డ్ అప్పుడే వద్దనుకున్నా. అలాంటప్పుడు ఒక యాంకర్‌ను పట్టుకుని నేను ఎలా అలాంటి ప్రయత్నాలు చేస్తాను?నేను యాంకర్‌ అవ్వాలనుకుంటే రెండు, మూడు ఛానల్స్‌లో అవకాశాలు ఉన్నాయి. నేను అడగకుండానే అవకాశాలు ఇస్తామన్న వాళ్లు కూడా ఉన్నారు’’

‘‘ప్రియాంక నుంచి చాలా నేర్చుకోవచ్చు, గట్స్‌ ఉన్న వ్యక్తి. హౌస్‌లో ఆమెకు మానస్‌ అంటే చాలా ఇష్టం. ఆ విషయం అందరికీ తెలుసు. ఎవరినైనా పెళ్లి చేసుకునేది ఉంటే మానస్‌ను చేసుకుంటానని చాలా సార్లు చెప్పింది. ప్రియకు నాకూ గొడవ జరుగుతున్న సమయంలో కూడా ప్రియాంక నా దగ్గరకు వచ్చి మానస్‌ గురించి మాట్లాడింది’’

‘‘హౌస్‌లో శ్వేత వర్మ సూపర్‌ పర్సన్‌. ఏదైనా తప్పు చేస్తే, ‘నేను తప్పు చేశాను’ అని అంగీకరించే వ్యక్తి. ఒకరి గురించి తప్పుగా చెప్పదు. మాట్లాడదు. ఎవరైనా అసందర్భంగా మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తనకు అవసరం లేని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోదు. తను అబ్బాయి అయితే, నేను పెళ్లి చేసుకుంటా. ఇంతకంటే మంచి వ్యక్తి దొరకడు. రోజూ ఇదే విషయాన్ని తనకి చెప్పేదాన్ని’’

‘‘సన్నీకి ఓసీడీ ఎక్కువగా ఉంది. ఎవరి ఎంగిలీ తినడు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పలేడు. టాస్క్‌ వచ్చినప్పుడు స్క్రీన్‌పై కనిపించాలని తాపత్రయ పడుతుంటాడు. నటరాజ్‌ మాస్టర్‌ అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ, ఏమీ తెలియదు. హౌస్‌లో ఉన్న ఒకరిద్దరు మాట్లాడిన మాటలు తెలిశాయనుకుంటా. వాటినే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పటికైనా వాటిని వదిలేస్తే బాగుంటుంది. మాస్టర్‌ అనుకుంటున్న గుంటనక్క ఎవరో కాదు.. రవి. హౌస్‌లో అందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఊసరవెల్లి ఎవరో మాత్రం నాకు తెలియదు’’ అని లహరి చెప్పుకొచ్చింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని