Bigg Boss Telugu 5: మానస్‌ విషయంలో తప్పు చేస్తున్నానా? నీ దిష్టే తగిలేలా ఉంది! - telugu news bigg boss telugu 5 latest promo kajal ravi nagarjuna
close
Updated : 14/10/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: మానస్‌ విషయంలో తప్పు చేస్తున్నానా? నీ దిష్టే తగిలేలా ఉంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గురువారం ప్రసారంకానున్న బిగ్‌బాస్‌ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. సంచాలకురాలు కాజల్‌ చేసిన మాటల యుద్ధంతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆ విశేషాలివీ.. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ అనే గేమ్‌కి సంబంధించి ప్రతి టీమ్‌ కౌంటింగ్‌ని తనకి చెప్పమని సిరి, కాజల్‌ని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ క్రమంలో ‘వీటిని నువ్వు ఓకే చేశావ్‌’ అని శ్వేత చెప్పగానే ‘నేను ఓకే చేసినవి మీరు సరిగా కాపాడుకోలేదు’ అంటూ కాజల్‌ దీటుగా సమాధానమిచ్చింది. సంచాలకురాలిగా నా జాబ్‌ నేను చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ‘సంచాలకురాలిగా నీ పవర్‌ని దుర్వినియోగం చేస్తున్నావ్‌’ అని రవి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, ముఖ్యమైన నియమాన్ని ఉల్లంఘించిన కారణంగా బిగ్‌బాస్‌ ఓ నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ పోటీ దారులు అయ్యేందుకు కొందరు హౌస్‌మేట్స్‌ని అనర్హులుగా ప్రకటించాడు. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగానే సన్నీ.. యానీ మాస్టర్‌ని ఎత్తుకుని డ్యాన్స్‌ చేశాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌ కూడా జరిగింది. మరోవైపు మానస్‌ గురించి, ప్రియాంక, సిరి, కాజల్‌, ప్రియలు మాట్లాడుకోవడం నవ్వులు పూయిస్తోంది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని