Bigg boss Telugu 5: సన్నీ ప్లేట్‌లో భోజనం చేసిన ప్రియ... అతను కెప్టెన్‌ అయితే, నేను ఆర్‌ఎం: ప్రియ - telugu news bigg boss telugu latest promo out now
close
Updated : 21/10/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss Telugu 5: సన్నీ ప్లేట్‌లో భోజనం చేసిన ప్రియ... అతను కెప్టెన్‌ అయితే, నేను ఆర్‌ఎం: ప్రియ

హైదరాబాద్‌: కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా హౌస్‌లో వాడీవేడీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం రోజుల నుంచి సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌మేట్స్‌ అందరూ ఫుల్‌ హ్యాపీ అయ్యారు. హౌస్‌లోకి లోబో రావటాన్ని దూరం నుంచి చూసిన రవి.. ఆనందంతో పరిగెత్తుకుని వచ్చి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. విశ్వ, అనీమాస్టర్‌ సైతం లోబో ఎంట్రీ పట్ల సంతోషంగా ఉన్నారు. మరోవైపు, బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌లో గెలుపొందడం కోసం జెస్సీ.. సిరి సాయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో, జెస్సీ-సిరిలపై షణ్ముఖ్‌ ఆగ్రహానికి లోనయ్యాడు. ‘‘ఇంటి సభ్యులందరూ ‘టాస్క్‌ సరిగ్గా ఆడు’ అంటున్నారు. అందరూ నన్ను లైట్‌ తీసుకుంటున్నారు. జెస్సీ కెప్టెన్‌ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను ఇలా మోసపోయాను. నాకు గేమ్‌ ఆడటం కూడా రాదు అదే నా దరిద్రం’’ అంటూ షణ్ముఖ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు షణ్ముఖ్‌ మాటలతో సిరి, జెస్సీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్‌-సిరి-జెస్సీల మధ్య అంతలా గొడవ జరగడానికి కారణమేమిటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఇక ఇంట్లోకి వచ్చిన లోబో బ్లాక్‌, గోల్డ్‌ ఎగ్‌లు తెచ్చాడు. బ్లాక్‌ ఎగ్‌ తీసుకున్న వాళ్లు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసే అర్హత కోల్పోతారని చెప్పాడు. ఇక గోల్డెన్‌ ఎగ్‌ తీసుకున్న వారికి అదనపు బలం వస్తుందని వివరించాడు. అవి ఎవరికి ఇస్తాడోన్న ఆసక్తి నెలకొంది. రెండు రోజులుగా సన్నీ, ప్రియల మధ్య హౌస్‌లో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఇద్దరూ కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. కాగా, ఆ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఈ రోజు సన్నివేశాలు కనిపించాయి. అందరూ కలిసి భోజనం చేస్తుండగా, ప్రియ వచ్చి ‘ఇక్కడ కూర్చొని భోజనం చేయవచ్చా’ అని అడిగింది. ‘ఐదుగురు ఓకే అన్నారు(సన్నీ అక్కడే ఉన్నా రవి అతడిని కౌంట్‌ చేయలేదు) అని రవి అనడంతో నవ్వులు పూశాయి. ‘సన్నీ కెప్టెన్‌ అయితే, నేను ఆర్‌ఎం(రేషన్‌ మేనేజర్‌) అవుతా. అప్పుడైనా తప్పకుండా మాట్లాడతాడు’ అని ప్రియ అన్నది. అనంతరం ‘నేను ఎవరి ప్లేట్‌లో తింటున్నా’ అని ప్రియ ఆ ప్లేట్‌ను పైకెత్తి చూడగా, అది సన్నీ ప్లేట్‌ కావడంతో ఇంట్లో వాళ్లందరూ అరిచి గోలపెట్టారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని