bigg boss telugu5: మొదటివారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే! - telugu news bigg boss telugu season 5 first week elimination
close
Published : 07/09/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

bigg boss telugu5: మొదటివారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే!

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇటీవల మొదలైన ‘సీజన్‌5’లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి వెళ్లారు. కాగా, మొదటివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తొలి వారానికి జస్వంత్‌, రవి, మానస్‌, సరయు, కాజల్‌, హమీదాలు నామినేట్‌ అయ్యారు.

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండటానికి అర్హులు కాని ఇద్దరు వ్యక్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టండి’ అని బిగ్‌బాస్‌ సూచించారు. ఈ సందర్భంగా వ్యర్థాలను వేసే కవర్లపై హౌస్‌మేట్స్‌ ఫొటోలు ముద్రించిన బ్యాగులను ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇద్దరు కంటెస్టెంట్‌లను ఎంచుకుని వారి ఫొటో ఉన్న బ్యాగును చెత్త డబ్బాలో వేయాలి. అత్యధిక మంది జస్వంత్‌ను నామినేట్‌ చేశారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? ఎవరు హౌస్‌లో కొనసాగతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని