Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రియాంక బావలు.. గోరుముద్దలు తినిపించుకున్న సిరి-షణ్ముఖ్‌ - telugu news biggboss telugu 5 latest episode
close
Published : 27/10/2021 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రియాంక బావలు.. గోరుముద్దలు తినిపించుకున్న సిరి-షణ్ముఖ్‌

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్‌ మొదలైంది. అంతకుముందు ఇంటి నుంచి తనకు వచ్చిన లెటర్‌ చూసి సన్నీ భావోద్వేగానికి గురయ్యాడు. మరికొందరి ఇంటి సభ్యులకు వచ్చిన లేఖలు ముక్కలైపోతుంటే చాలా బాధగా అనిపించిందని సన్నీ-కాజల్‌ మాట్లాడుకున్నారు. విశ్వ.. సేఫ్‌గేమ్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని.. లెటర్‌ అందుకుంటే నామినేషన్‌ నుంచి బయటపడతామనే ఉద్దేశంతో కావాలనే ఏడ్చాడని షణ్ముఖ్‌-సిరి చెప్పుకున్నారు.

షణ్ముఖ్‌కు రవి గీతోపదేశం..

హౌస్‌మేట్స్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘‘నేనూ మానస్‌ టాప్‌-5 దాకా ఉంటాం’’ అని పింకీ అంటే ‘‘మరి మేమేంటి అడుక్కు తినాలా?’’ అంటూ సిరి సమాధానం ఇచ్చింది. ఇక ‘‘అంకుల్స్‌ అందరూ వెళ్లిపోవాలి.. కుర్రాళ్లు ఉండిపోవాలి’’ అని మానస్ అంటే ‘‘ఆంటీలు వెళ్లిపోవాల్సి వస్తే ప్రియాంక కూడా వెళ్లిపోతుంది’’ అంటూ సిరి ఆటపట్టించింది. ‘‘వేర్‌ ఈజ్‌ షణ్ణు అంటే, మోజ్‌ రూమ్‌ విత్‌ త్రీ, ఆన్‌ బెడ్‌ విత్‌ త్రీ ఇదే నాకు కనిపించింది’’ అని షణ్ముఖ్‌కు రవి గీతోపదేశం చేశాడు. శ్రీరామ్‌ శకునిలా మాట్లాడుతూ.. రవిని ఉద్దేశించి ‘‘దుర్యోధన’’ అనడం నవ్వులు పూయించింది. ఇక హౌస్‌మేట్స్‌ను మానస్‌, సన్నీ, రవిలు అనుకరించిన విధానం కితకితలు పెట్టించింది.

ప్రియాంక.. ముద్దుల బావలు వీళ్లే..

ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య సరదా సంభాషణ జరిగింది.  హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఓ ముగ్గుర్ని ప్రియాంక బాగా కవర్‌ చేస్తుందని వీళ్లు సరదాగా జోక్‌ చేసుకున్నారు. ప్రియాంకకు శ్రీరామ్‌ పెద్ద బావ.. మానస్‌ చిన్న బావ.. జెస్సీ బుల్లిబా.. అంటూ లోబోకు రవి వివరించడం నవ్వులు పూయించింది. ఈ మొత్తం సంభాషణ విని ప్రియాంక సైతం సరదాగా నవ్వుకుంది. ఈ సందర్భంగా లోబో.. ప్రియాంకతో మాట్లాడుతూ.. ‘‘నీ మాట వినని పెద్దబావ కాళ్లూచేతులు తీసేస్తాను’’ అని అంటే ‘‘అయ్యయ్యో అలా చేయవద్దు అన్నయ్య’’ అని ప్రియాంక బతిమలాడుకుంది. చిన్నబావ అన్ని విషయాల్లోనూ అడ్జెస్ట్‌ అవుతాడని చెప్పుకొచ్చింది. ‘‘నీకు కూడా అతడే కదమ్మా కావాల్సింది’’ అని రవి కౌంటర్‌ ఇవ్వడం నవ్వులు పూయించింది.

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ అభయహస్తం..

ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘అభయహస్తం’ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా హౌస్‌ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ టాస్క్‌లో గెలుపొందిన వారికి మాత్రమే ఇంటిలోపలికి వెళ్లే అవకాశం ఉందని చెప్పాడు. ‘అభయహస్తం’లో భాగంగా ఇద్దరికి చొప్పున ఒక టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా లోబో-షణ్ముఖ్‌లకు ‘మట్టిలో ముత్యం’ టాస్క్‌ ఇచ్చాడు. పేడలో ఉన్న ముత్యాలను ఎవరు ఎక్కువ తీసి.. శుభ్రంగా ఉంచుతారో వాళ్లే విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్‌ సూచించాడు. లోబో 74.. షణ్ముఖ్‌ 101 ముత్యాలు వెలికితీశారు. అయితే, లోబో ముత్యాలు శుభ్రంగా ఉన్నా.. అతన్ని ఎంపిక చేయకుండా ఎక్కువ తీసిన షణ్ముఖ్‌ను విజేతగా ప్రకటించాడు సన్నీ. దీంతో ఇంటిసభ్యుల మధ్య కొంత చర్చ జరిగింది.

అనంతరం జరిగిన ‘‘గాలం మార్చే మీ కాలం’’ అనే పోటీలో సిరి-రవి పోటీ పడ్డారు. పూల్‌లో మునిగి ఉన్న బాటిల్స్‌ను ఫిషింగ్‌ రాడ్‌ సాయంతో పైకి తీయాల్సి ఉంటుంది. ఈ పోటీలో సిరి 15.. రవి 12 బాటిల్స్‌ బయటకు తీశారు. సిరి విజయం సాధించడంతో ఎగిరిగెంతులేసింది. షణ్ముఖ్‌-సిరిలకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం రావడంతో ఇద్దరూ ఆనందపడ్డారు. కిచెన్‌లోకి వెళ్లి కావాల్సినవి వండుకుని తిన్నారు. ఒకరికొకరు తినిపించుకున్నారు.

శ్రీరామ్‌ వర్సెస్‌ మానస్‌.. తాడుల తకదిమి.. 

‘అభయహస్తం’లో భాగంగా బిగ్‌బాస్‌.. శ్రీరామ్‌, మానస్‌లకు ‘తాడుల తకదిమి’ అనే పోటీ పెట్టాడు. ఎవరైతే ఎక్కువసేపు రోపులను ఆపకుండా ఊపుతారో వాళ్లే విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఇందుకోసం ఇద్దరూ తీవ్రంగా శ్రమించారు. చివరికి మానస్‌ తాడులను వదిలేయడంతో శ్రీరామ్‌ విజయం సాధించాడు. ఇంకా రెండు టాస్క్‌లు మిగిలే ఉన్నాయి. వీటిల్లో ఎవరు విజయం సాధించి కెప్టెన్సీ పోటీదారులు అవుతారో వేచి చూడాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని