West Bengal: మా లక్ష్యం.. ఓడిన ముఖ్యమంత్రిని ఓడించడమే..! - telugu news bjp will not nominate any candidate for rajyasabha bypoll due in west bengal
close
Updated : 21/09/2021 05:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

West Bengal: మా లక్ష్యం.. ఓడిన ముఖ్యమంత్రిని ఓడించడమే..!

బెంగాల్‌లో రాజ్యసభ ఉప ఎన్నికలో అభ్యర్థిని దింపని భాజపా

కోల్‌కతా: రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి సుస్మితా దేవ్‌పై భాజపా ఎవరిని బరిలో దింపడం లేదు. ఈ విషయాన్ని పశ్చిమ్‌ బెంగాల్ భాజపా నేత సువేందు అధికారి వెల్లడించారు.

‘పశ్చిమ్‌ బెంగాల్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నిక కోసం భాజపా అభ్యర్థిని నామినేట్ చేయడం లేదు. ఫలితం తెలిసిందే. మా దృష్టంతా ముఖ్యమంత్రిపైనే. ఒకసారి ఓడిన ఆమెను.. మరోసారి ఓడించడమే మా లక్ష్యం’ అంటూ సువేందు సోమవారం ట్వీట్ చేశారు. గత నెల సుస్మిత కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆమెకు అస్సాం, త్రిపురలో పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న సుస్మిత.. పార్టీ వీడటంతో ఈశాన్య రాష్ట్రాల్లో హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇక, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పశ్చిమబెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా మే 5న బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటినుంచి ఆరు నెలల్లోగా అనగా.. నవంబర్‌ 5వ తేదీలోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సెప్టెంబర్‌ 30న ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో భవానీపూర్‌ నుంచి మమత పోటీకి దిగారు. భాజపా ఇక్కడ న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బరిలోకి దింపింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని