ఓటీటీలోకి.. ‘షేర్షా’, ‘బ్లాక్‌ విడో’ - telugu news black widow and shershaah movies going to release on ott
close
Published : 15/07/2021 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలోకి.. ‘షేర్షా’, ‘బ్లాక్‌ విడో’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో చాలా చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోనే నిలిచాయి ‘షేర్షా’, ‘బ్లాక్‌ విడో’ చిత్రాలు. ఈ సినిమాల్ని డిజిటల్‌ మాధ్యమాల్లో విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాయి చిత్ర బృందాలు. సిద్దార్థ మల్హోత్రా, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమే ‘షేర్షా’. విష్ణువర్ధన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, క్యాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కార్గిల్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. స్కార్లెట్‌ జాన్సెన్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘బ్లాక్‌విడో’ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించనున్నారు. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్టు ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అలరించనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని