Shilpa Shetty: మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి - telugu news bollywood actress shilpa shetty back to sets
close
Updated : 19/08/2021 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shilpa Shetty: మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటి శిల్పాశెట్టి మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం, మరోవైపు ఫిట్‌నెస్‌ సెంటర్‌ విషయంలో ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినందుకు తనపై, ఆమె తల్లి సునంద శెట్టిపై కేసు నమోదవడంతో శిల్పా వ్యక్తిగతంగా సతమతమైంది. దాంతో ‘సూపర్‌ డ్యాన్సర్‌’ రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న ఆమె కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ ఆ షోలో సందడి చేయనున్నారామె. న్యాయనిర్ణేతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు మళ్లీ ఆ కార్యక్రమ సెట్స్‌లో అడుగుపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉంచగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. శిల్పతోపాటు కొరియోగ్రాఫర్‌ గీతాకపూర్‌, దర్శకుడు అనురాగ్‌ బసు ఉన్నారు.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని