బావిలో కారును బయటకు తీసిన అధికారులు.. ఒక మృతదేహం లభ్యం - telugu news car crashed in to a farm well
close
Updated : 30/07/2021 05:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బావిలో కారును బయటకు తీసిన అధికారులు.. ఒక మృతదేహం లభ్యం

చిగురుమామిడి: కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం రెస్క్యూ టీమ్‌కు కష్టంగా మారింది. దాదాపు 8గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. అందులో ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడు విశ్రాంత ఉద్యోగి పాపయ్య నాయక్‌గా గుర్తించారు. భీమదేవరపల్లి మండలం సూర్యానాయక్‌ తండా ఆయన స్వస్థలం. పాపయ్య నాయక్‌ హుస్నాబాద్‌ అక్కన్నపేటలో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించి... ఇటీవలే పదవీ విరమణ పొందారు. కరీంనగర్‌ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో నలుగురైదుగురు ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ, కారు బయటకు తీసిన తర్వాత అందులో ఒక మృతదేహాన్ని గుర్తించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని