Sadha: మీరు పెళ్లి చేసుకుంటే మేం చాలా ఆనందంగా ఉంటాం..! - telugu news cash latest promo etv suma rasi sadha maheswari shraddha das
close
Published : 02/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sadha: మీరు పెళ్లి చేసుకుంటే మేం చాలా ఆనందంగా ఉంటాం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయికలు రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా.. ఒక్కచోట చేరితే ఎలా ఉంటుందో ‘క్యాష్‌’ కార్యక్రమం చూపించనుంది. సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం రాత్రి 9:30 ని.లకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ఇది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై, విశేషంగా అలరిస్తోంది. కార్యక్రమానికి విచ్చేసిన రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా తమదైన శైలిలో నవ్వులు పూయించారు. వారితో కలిసి సుమ చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది.

ఈ కార్యక్రమంలో సుమ కొన్ని చిలిపి ప్రశ్నలు అడిగే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘సదాగారు మీ కెరియర్‌లో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రశ్నల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందేంటి?’ అని ప్రశ్నించగా ‘మీరు పెళ్లి చేసుకుంటే మేం చాలా హ్యాపీగా ఉంటాం’ అని అందరు అడుగుతుంటారు అని సదా సరదాగా చెప్తుంది. తర్వాత ‘సుమ టీ స్టాల్‌’, ‘హోమ్‌ టూర్‌’ వంటి స్కిట్లతో నలుగురు నాయికలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాని గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి...




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని