CBI: ఆదాయపన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌పై సీబీఐ కేసు నమోదు - telugu news cbi filed case against income tax inspector
close
Published : 30/07/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CBI: ఆదాయపన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌పై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారన్న అభియోగంపై ఆదాయపన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌ తోట పురుషోత్తమరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. పురుషోత్తమరావు 12 ఏళ్లలో ఆదాయానికి మించి సుమారు రూ.1.15 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. పురుషోత్తమరావు 1991లో తాత్కాలిక ఉద్యోగిగా ఐటీశాఖలో చేరి ..వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆదాయపన్ను ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రికార్డుల ప్రకారం 2008కి ముందు పురుషోత్తమరావు ఆస్తుల విలువ రూ.86,896 కాగా, 2020 డిసెంబరు నాటికి రూ.1.72 కోట్లకు చేరాయని సీబీఐ పేర్కొంది. కొన్ని ఆస్తులు పురుషోత్తమరావు భార్య సౌభాగ్యలక్ష్మి పేరిట ఉండటంతో ఆమె పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని