Romantic: ‘రొమాంటిక్‌’ ప్రీమియర్‌.. స్టార్‌ సెలబ్రిటీల సందడి - telugu news celebrities attends to romantic premiere show
close
Updated : 28/10/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic: ‘రొమాంటిక్‌’ ప్రీమియర్‌.. స్టార్‌ సెలబ్రిటీల సందడి

వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నటుడు ఆకాశ్‌ పూరీ (Akash puri). ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన హీరోగా విజయం సాధించేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘రొమాంటిక్‌’ (Romantic). అనిల్‌ పాడూరి దర్శకత్వంవహించిన ఈ సినిమాలో వాస్కోడిగామా అనే యువకుడిగా ఆకాశ్‌ మాస్‌ పాత్రలో నటించారు. కేతికాశర్మ(Kethika Shrama) కథానాయిక. అక్టోబర్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ సెలబ్రిటీల కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మాల్‌లో రొమాంటిక్‌ సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి దంపతులు, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని, మెహర్‌రమేశ్‌, బాబీ, బొమ్మరిల్లు భాస్కర్‌, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, గుణశేఖర్‌, అలీ, సత్యదేవ్‌, విశ్వక్‌ సేన్‌, ఆనంద్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ తారలు ఈ ప్రీమియర్‌ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్‌’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్‌ తప్పకుండా విజయం సాధిస్తాడని తెలిపారు. ఈ ప్రీమియర్‌ షోకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని