Chandrababu: నరేగా బిల్లులు రాలేదా.. నాకు చెప్పండి: చంద్రబాబు - telugu news chandrababu fires on ysrcp govt
close
Published : 24/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chandrababu: నరేగా బిల్లులు రాలేదా.. నాకు చెప్పండి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఎవరికైనా నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) బిల్లులు రాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నరేగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. బాధితులకు ప్రభుత్వం వడ్డీతో సహా చివరి పైసా చెల్లించే వరకూ ఈ విభాగం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. కుట్ర పూరితంగా వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన నరేగా బిల్లులపై కోర్టు మొట్టికాయలు తిన్నా బుద్ధిరాలేదని మండిపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పలు చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో బిల్లులు నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు సమస్యలు పరిష్కారం కాని వారు 9393540999, 9676088463, 9440990479 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని