Crime news: తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం - telugu news cheating with name of gold
close
Published : 29/09/2021 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం

బాపట్ల: గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన మాజీ సైనికోద్యోగి రవికిరణ్‌కు బంగారు బిస్కట్లు తక్కువ ధరకు ఇస్తామని చీరాలకు చెందిన ప్రతాప్‌ ఆశ చూపాడు. అది నమ్మిన రివికిరణ్‌ డబ్బుతో వచ్చాడు. అతడిని ప్రతాప్‌ బాపట్ల మండలం వెదుళ్లపల్లి వద్దకు రమ్మన్నాడు. వెదుళ్లపల్లి రాగానే రవికిరణ్పై ప్రతాప్‌ ముఠా దాడి చేసి రూ.6.10లక్షలు దోచుకున్నారు. బాధితుడు రవికిరణ్ ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీరాలకు చెందిన ప్రతాప్‌ ముఠాపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని