Chiranjeevi: ఏపీ సినిమా టికెట్ల అంశంపై చిరు అభ్యర్థన - telugu news chiranjeevi comments on ap cinema tickets issue
close
Updated : 25/11/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ఏపీ సినిమా టికెట్ల అంశంపై చిరు అభ్యర్థన

హైదరాబాద్‌: సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ నటుడు చిరంజీవి విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.

దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని