Chiranjeevi: ‘రంగమార్తాండ’కు మెగాస్టార్‌ వాయిస్‌ - telugu news chiranjeevi lends his voice for rangamarthanda
close
Published : 26/10/2021 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ‘రంగమార్తాండ’కు మెగాస్టార్‌ వాయిస్‌

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నాటకాన్ని ప్రాణంగా భావించి.. దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమవుతోంది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మధ్యాహ్నం కృష్ణవంశీ ఓ ట్వీట్‌ చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని