Sooryavanshi: విడుదల ఎప్పుడో దేవుడికే తెలియాలి! - telugu news confuession in sooryavanshi release
close
Published : 06/08/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sooryavanshi: విడుదల ఎప్పుడో దేవుడికే తెలియాలి!

ముంబయి: కరోనా కారణంగా ఆగిపోయిన పెద్ద చిత్రాలు థియటర్లలోకి ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. దర్శకనిర్మాతలు విడుదల తేదీల గురించి ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఒక్క అక్షయ్‌కుమార్‌ ‘బెల్‌బాటమ్‌’ చిత్రం మాత్రమే ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. అక్షయ్‌ నటించిన ‘సూర్యవంశీ’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. గత ఏడాది నుంచీ విడుదల కోసం వేచి చూస్తున్న ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. ఈ మధ్య ‘బెల్‌బాటమ్‌’ విడుదల కార్యక్రమం జరిగింది. ఆ వేడుకలో ‘సూర్యవంశీ’ విడుదల ఎప్పుడు? అని విలేకరులు అడగ్గా..‘‘సూర్యవంశీ’ విడుదల ఎప్పుడో ఇద్దరికే తెలుసు. ఒకటి ఆ దేవుడికి, రెండోది రోహిత్‌ శెట్టికి’’అని సమాధానం ఇచ్చారు అక్షయ్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో పోలీస్‌ కథాంశంతో తెరకెక్కించిన ‘సూర్యవంశీ’లో కత్రినాకైఫ్‌ నాయికగా నటించింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని